Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రావో భళా.. సూపర్ కింగ్స్ కళకళ

చెపాక్ స్టేడియంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జయభేరి మోగించింది. విజయం దిశగా సాగుతోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను చివర్లో బ్రావో దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి పంజాబ్ ను నిలువరించాడు. దీంతో, పంజాబ్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పంజాబ్ జట్టులో షాన్ మార్ష్ 73 పరుగులతో అద్భుత పోరాటం చేశాడు. అతనికి మిల్లర్ (51 నాటౌట్) సహకారం అందించాడు. అంతకుముందు చెన్నై 4 వికెట్లకు 186 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రైనా సెంచరీ సాధించాడు.

More Telugu News